జేమ్స్ బాండ్ చిత్రాల తరహాలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన గూఢచారి బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. అడవి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ చిత్రంలో శోభితా దూళిపాళ్ల, జగపతిబాబు, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని ముఖ్యపాత్రల్లో నటించారు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రంలో హీరోయిన్గా నటించిన సుప్రియా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. శశి కిరణ్ టిక్కా దర్శకత్వంలో అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ చిత్రానికి అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. 2018 ఆగస్టు 3న విడుదలైన ఈ చిత్రం నేటితో మూడేళ్లు పూర్తి చేసుకుంది. సైలెంట్‌గా వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం..
నైజాం:3.25 కోట్లు
సీడెడ్:0.60 కోట్లు
ఉత్తరాంధ్ర:1.05 కోట్లు
ఈస్ట్:0.55 కోట్లు
వెస్ట్:0.30 కోట్లు
కృష్ణ:0.68 కోట్లు
గుంటూరు:0.43 కోట్లు
నెల్లూరు:0.20 కోట్లు
ఏపీ+తెలంగాణ:7.06 కోట్లు
యూఎస్ఏ:2.13 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా:1.14 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ : 10.33 కోట్లు
గూఢచారి చిత్రానికి రూ.5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసే సరికి ఈ చిత్రం రూ.10.33 కోట్ల షేర్ ను వసూలు చేసింది.దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.4.83 కోట్ల లాభం వచ్చిందన్న మాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ట్రిపుల్ ఆర్ కోసం కీరవాణి అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్