ఆదివారం 17 జనవరి 2021
Cinema - Dec 02, 2020 , 11:13:40

ఆదిత్య‌ను పెళ్లాడిన న‌టి శ్వేత అగ‌ర్వాల్

ఆదిత్య‌ను పెళ్లాడిన న‌టి శ్వేత అగ‌ర్వాల్

ముంబై : ప‌్ర‌ముఖ గాయ‌కుడు ఉదిత్ నారాయ‌ణ్ కుమారుడు, న‌టుడు ఆదిత్య నారాయ‌ణ్ న‌టి శ్వేత అగ‌ర్వాల్‌ను వివాహ‌మాడాడు. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్‌లో మంగ‌ళ‌వారం రాత్రి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఆదిత్య పెళ్లి వేడుక జ‌రిగింది. ఈ జంట పెళ్లి ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఆదిత్య త‌ల్లి దీపా బ‌రాత్‌లో సంద‌డి చేసిన దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి. 

ఆదిత్య‌, శ్వేత అగ‌ర్వాల్ మ‌ధ్య షాపిత్ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో స్నేహం ఏర్ప‌డింది. ఆ స్నేహం కాస్త ప్రేమ‌గా మారింది. ప‌దేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట కుటుంబ పెద్ద‌ల స‌మ‌క్షంలో ఒక్క‌ట‌య్యారు. ఆదిత్య‌, శ్వేత దంప‌తుల‌కు ప‌లువురు సెల‌బ్రిటీలు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.