బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 10:15:53

కొడుకు రిసెప్ష‌న్‌లో చిందులేసిన ఫేమ‌స్ సింగ‌ర్

కొడుకు రిసెప్ష‌న్‌లో చిందులేసిన  ఫేమ‌స్ సింగ‌ర్

తెలుగులో ఉదిత్ నారాయణ్ పరిచయం అక్కర్లేని గాయకుడు. అందమైన ప్రేమరాణి చేయి తగిలితే... (ప్రేమికుడు) నుంచి మొదలు.. మెగాస్టార్ చిరంజీవికి రాధే గోవిందా.. ప్రేమె కుట్టిందా (ఇంద్ర) వంటి ఎన్నో వందల హిట్ సాంగ్స్ పాడారాయన.  ఆయ‌న త‌న‌యుడు ఆదిత్య నారాయ‌ణ్ కూడా మంచి సింగ‌రే. ఈయ‌న శ్వేత అగ‌ర్వాల్‌ను వివాహ‌మాడాడు. ముంబైలోని ఇస్కాన్ టెంపుల్‌లో మంగ‌ళ‌వారం రాత్రి కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో ఆదిత్య పెళ్లి వేడుక జ‌రిగింది. షాపిత్ చిత్రం షూటింగ్ స‌మ‌యంలో వారిద్ద‌రి మధ్య‌ స్నేహం ఏర్ప‌డింది. అది కాస్త ప్రేమ‌గా మారడంతో ప‌దేళ్ల పాటు ప్రేమించుకొని రీసెంట్‌గా పెళ్లి పీట‌లెక్కారు. 

బుధ‌వారం రోజు ఆదిత్య‌,శ్వేత అగ‌ర్వాల్ ల రిసెప్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌లో ఆదిత్య బ్లాక్ సూట్ ధ‌రించ‌గా, శ్వేతా రెడ్ క‌ల‌ర్ లెహంగాలో మెరిసింది. నూత‌న దంప‌తుల‌కు ప‌లువురు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అయితే ఆదిత్య తండ్రి ఉదిత్ , త‌ల్లి దీపా .. క‌బీ ఖుషీ క‌బీ గ‌మ్ చిత్రంలోని బోలే చూడియా పాట‌కు త‌మ‌దైన స్టైల్‌లో స్టెప్పులు వేసి ఆక‌ట్టుకున్నారు. ఈ వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కాగా, రిసెప్ష‌న్ వేడుక‌కు గోవిందా, అత‌ని భార్య సునీత‌, కూతురు టినాతో పాటు క‌మెడీయ‌న్ భార‌తి సింగ్‌, భ‌ర్త హార్ష్ లింబాచియా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.logo