తెలుగు ప్రేక్షకులకు ఆదిత్య మ్యూజిక్ ఛానల్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఆదిత్య మ్యూజిక్ అనేది ఒక ఎమోషన్. గత మూడు దశాబ్దాలుగా పాటల సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుగా వెలిగిపోతుంది. టెక్నికల్‌గా ఎన్నో ఒడిదుడుకులు అధిగమించి.. దినదినాభివృద్ధి చెందుతూ.. క్యాసెట్ల కాలం నుంచి CD, ఆ తర్వాత నేటి డిజిటల్ యుగానికి కూడా ఆదిత్య మ్యూజిక్ సరిగ్గా ట్యూన్ అయ్యింది. ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తమను తాము మార్చుకుంటూ ఎన్నో సంచలనాలు సృష్టించింది. తెలుగు అభిమానులకు పాటలు అంటే ఆదిత్య మ్యూజిక్.. ఆదిత్య మ్యూజిక్ పాటలు అనేంతగా మమేకం అయిపోయింది.
తాజాగా ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానల్ మరొక సంచలనం సృష్టించింది. సౌత్ ఇండియాలో మరే మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానల్‌కు సాధ్యం కానీ స్థాయిలో 20 మిలియన్ల సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. అంటే రెండు కోట్ల మంది ఫాలోవర్స్ అన్నమాట. ఇంత విజయం సాధించడం వెనుక ఎన్నో సంవత్సరాల కృషి దాగి ఉంది. తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త మ్యూజిక్ అందించడానికి ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానల్ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇందులో వాళ్లు విజయం సాధిస్తూనే ఉన్నారు. దానికి నిదర్శనమే 20 మిలియన్ సబ్స్క్రైబర్స్. తమను ఇంతగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ఇవ్వడానికి ఆదిత్య మ్యూజిక్ ఎండీ ఉమేష్ గుప్తా, డైరెక్టర్ ఆదిత్య గుప్తా కృషి చేస్తూనే ఉన్నామని తెలిపారు.
ఈ సందర్భంగా ఉమేష్ గుప్తా మాట్లాడుతూ.. తమను మూడు దశాబ్దాలుగా ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ఇవ్వడానికి.. ప్రేక్షకులకు వినోదం అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటామని ఆయన తెలిపారు. డైరెక్టర్ ఆదిత్య గుప్తా మాట్లాడుతూ.. ఆదిత్య మ్యూజిక్ ఛానల్ 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఈ విజయం కేవలం మాది మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులది కూడా. వాళ్లకు ఎప్పుడూ సరికొత్త వినోదం అందించడానికి కృషి చేస్తూనే ఉంటామని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Love story | లవ్‌స్టోరి సినిమా రివ్యూ
సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..
వేణు మాధవ్ రెండో వర్ధంతి.. నల్ల బాలును మరోసారి గుర్తు చేసుకుందామా..!
Samantha Akkineni | సమంత లవ్‌స్టోరి సినిమా చూడదట!
అనుష్క పెళ్లి విషయంలో జ్యోతిష్కుడు కీలక వ్యాఖ్యలు