శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 27, 2020 , 16:42:47

య‌ష్ జ‌యంతి.. కొత్త లోగో ఆవిష్క‌రించిన త‌న‌యుడు

య‌ష్ జ‌యంతి.. కొత్త లోగో ఆవిష్క‌రించిన త‌న‌యుడు

ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు నిర్మించిన భారీ నిర్మాణ సంస్థ‌ యష్ రాజ్ ఫిలిమ్స్ కు 1970 సెప్టెంబర్ 27 న పునాది ప‌డింది. ఈ సంస్థ స్థాపించిన  యష్ చోప్రా 1932 సెప్టెంబ‌ర్ 27న జ‌న్మించారు.  యష్ చోప్రా స్థాపించిన‌ యష్ రాజ్ ఫిలిమ్స్‌కి  నేటితో 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా య‌ష్ త‌న‌యుడు ఆదిత్య చోప్రా సంస్థ కొత్త లోగో విడుద‌ల చేశారు.

బీఆర్ ఫిలిమ్స్‌లో ఉద్యోగిగా ఉన్న  యష్ చోప్రా ఆ ఉద్యోగం మానేసి 1970లో కొత్త కంపెనీ ప్రారంభించారు. అప్పటి వరకు ఆయనకు బీఆర్ ఫిలిమ్స్ నుండి అందే జీతం తప్పితే సొంతంగా ఏమీ లేదు. వ్యాపారం ఎలా నడపాలో కూడా తెలియని ఆయన.. యష్ రాజ్ ఫిలిమ్స్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయనకు తన ప్రతిభపై, కష్టపడే మనస్తత్వంపై ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆ ధైర్యంతోనే ఆయన యష్ రాజ్ ఫిలిమ్స్ స్థాపించి ఇంతటి పెద్ద కంపెనీ చేశారు.