గురువారం 28 మే 2020
Cinema - May 19, 2020 , 17:04:06

నీటి శబ్దంతో భరతనాట్యం : అదితిరావు హైదరి

నీటి శబ్దంతో భరతనాట్యం : అదితిరావు హైదరి

సమ్మోహనం సినిమాతో టాలివుడ్‌లో అరంగేట్రం చేసిన అదితి రావు హైదరి మొదటి సినిమాకే  ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నది. తరువాత అంతరిక్షం సినిమాతో స్టార్‌ హీరోయిన్‌ లిస్ట్‌లోకి చేరిపోయింది. అయినా తెలుగులో పెద్దగా ఆఫర్లు ఏవీ రాలేదు. అయితే అదితికి యాక్టింగ్‌ ఒకటే  ప్యాషన్‌ కాదంటున్నది. భరతనాట్యంలో నైపుణ్యం కలిగిన అదితి ఇటీవల ఓ వీడియోను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది. నీటిశబ్దంతో వచ్చే మ్యూజిక్‌తో భరతనాట్యం అద్భుతంగా చేసింది. డ్యాన్సింగ్‌ గురువు లీలా సామ్సన్‌ పుట్టినరోజు సందర్బంగా, ఆమె పట్ల గౌరవం చూపుతూ ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. వాటర్‌సౌండ్‌ భరతనాట్యం లాక్‌డౌన్‌లో అభిమానులను అలరిస్తున్నది. ఇటీవల సైకో సినిమాలో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌గా ఆడింది.
logo