మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 14:43:31

కత్రినాకు ప్రపోజ్‌ చేసిన ఆదిత్యారాయ్‌కపూర్‌..త్రోబ్యాక్‌ స్టిల్స్‌

కత్రినాకు ప్రపోజ్‌ చేసిన ఆదిత్యారాయ్‌కపూర్‌..త్రోబ్యాక్‌ స్టిల్స్‌

ఆశిఖి-2 చిత్రంతో వరల్డ్‌ వైడ్‌గా అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్‌ యువ నటుడు ఆదిత్యారాయ్‌కపూర్‌. ఈ యాక్టర్‌ 2020 ప్రథమార్థంలో మలంగ్‌ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించాడు. ఆదిత్యారాయ్‌కపూర్‌, అలియాభట్‌ తో కలిసి నటించిన సడక్‌-2 ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. నాలుగేళ్ల క్రితం కత్రినాకైఫ్‌, ఆదిత్యారాయ్‌ కపూర్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఫితూర్‌. లవ్‌ బ్యాక్‌ డ్రాప్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాపీస్‌ వద్ద మంచి టాక్‌ తెచ్చుకుంది.

కత్రినా, ఆదిత్యాల మధ్య సీన్లు సినిమాకే హైలెట్‌ గా నిలుస్తాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌ టైంలో ఆదిత్యారాయ్‌కపూర్‌, కత్రినాకు గులాబీ పూల బొకే అందించి ప్రపోజ్‌ చేసిన త్రోబ్యాక్‌ ఫొటోలు ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo