శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Aug 18, 2020 , 09:06:56

3 డీ టెక్నాల‌జీతో ఆదిపురుష్‌.. వినోదానికి ‌కొద‌వ ఉండ‌దంటున్న మేక‌ర్స్

3 డీ టెక్నాల‌జీతో ఆదిపురుష్‌.. వినోదానికి ‌కొద‌వ ఉండ‌దంటున్న మేక‌ర్స్

బాహుబ‌లి సినిమా కోసం దాదాపు ఐదేళ్ళు కేటాయించిన ప్ర‌భాస్ ఈ సినిమా రిలీజ్ త‌ర్వాత జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఐదేళ్ళుగా ప్ర‌భాస్ సినిమా కోసం క‌ళ్ళ‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కి ఈ సినిమా మాంచి ఫీస్ట్ ఇచ్చింది. ప్ర‌స్తుతం రాధేశ్యామ్ అనే చిత్రంతో బిజీగా ఉన్న ప్ర‌భాస్ ఈ మూవీ త‌ర్వాత నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక‌ల్ మూవీ చేయ‌నున్నాడు.

వ‌రుస సినిమాలు ప్ర‌క‌టిస్తూ ఫ్యాన్స్‌లో ఉత్సాహం తెస్తున్న ప్ర‌భాస్ తొలిసారి బాలీవుడ్ ద‌ర్శ‌కుడితో క‌లిసి పాన్ ఇండియా సినిమా చేయ‌బోతున్నాడు. తానాజీ ఫేం ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి ఆదిపురుష్ అనే టైటిల్ ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని మొత్తం 5 భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించగా హిందీ మరియు తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కించి మిగతా భాషల్లో డబ్ చేసి విడుదల చేయనున్నారట.

టీ-సీరిస్‌ బ్యానర్‌పై భూషణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 3డీ టెక్నాల‌జీతో రూపొంద‌నుంద‌ట‌.  శ్రీమహావిష్ణు మొట్టమొదటి అవతారం “ఆదిపురుషుడు” ఆధారంగా చెడు మీద మంచి ఎలా గెలిచింది అనే మన దేశపు ఇతిహాసంను అనుసరించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్టు తెలుస్తుంది. తాజా అనౌన్స్‌మెంట్‌తో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆనందం పీక్ స్టేజ్‌కి చేరింది.