కన్నడ స్టార్ యాక్టర్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కేజీఎఫ్ చాఫ్టర్ 2. ఈ ప్రాజెక్టు నుంచి విడుదలైన రషెస్ కు అద్బుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన కేజీఎఫ్ 2 లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. సినిమా అప్ డేట్ కోసం ఎక్జయిటింగ్ గా ఎదురుచూస్తున్న సినీ లవర్స్ కోసం మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ విడుదల చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఈ మూవీలో అధీరా లుక్ లో కనిపించనుండగా..తాజాగా దీనికి సంబంధించి మరో పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. డార్క్ షేడ్స్ ఉన్న ప్రాంతం నుంచి సంజయ్ దత్ చేతిలో ఖడ్గం పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న స్టిల్ స్టన్నింగ్ గా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవీనా టండన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. అధీరా లుక్ ను మూవీ లవర్స్ కు పరిచయం చేస్తూ కేజీఎఫ్ 2 మేకర్స్ ఇప్పటికే ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..