శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 23, 2020 , 00:10:14

పేమ విఫలమైనా కోలుకున్నా!

పేమ విఫలమైనా కోలుకున్నా!

ప్రతి ఒక్కరి జీవితంలో విఫల ప్రేమకథలుంటాయని, గతాన్ని మరచిపోయి వాస్తవాన్ని అంగీకరించినప్పుడే భగ్న ప్రేమ తాలూకు మనోవేదన నుంచి కోలుకుంటామని చెబుతోంది ఢిల్లీ సొగసరి అదాశర్మ. ఇటీవలే ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ప్రేమ, పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చింది. ప్రేమలో విఫలమైతే ఆ బాధను మీరెలా అధిగమిస్తారని అడగ్గా..‘నా జీవితంలో కూడా ఫెయిల్యూర్‌ లవ్‌స్టోరీ ఉంది. అయితే నన్ను ఎంతగానో ప్రేమించే కుటుంబం, అనుక్షణం నా శ్రేయస్సును కాంక్షించే మిత్రులు తోడుగా ఉండటంతో ఆ బాధ నుంచి త్వరగా ఉపశమనం పొందాను. ఎంతటి కష్టం వచ్చినా మేమున్నామనే భరోసానిచ్చే ఆప్తులుంటే జీవితంలో మనల్ని ఏ విషాదమూ కదిలించలేదు. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..జీవితం మన కోసం ఎప్పుడు వేచిచూడదు. కాలం సాగిపోతూనే ఉంటుంది. గత స్మృతుల్ని తలచుకొని  నిరాశలో కూరుకుపోతే మన అనుకునేవాళ్లు కూడా ఏదో రోజు మనకు దూరంగా వెళ్లిపోతారు. వర్తమానాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నదే నా సిద్ధాంతం’ అని తాత్విక ధోరణిలో బదులిచ్చింది.