శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 12:20:21

న‌టి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ హ్యాక్..!

న‌టి ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ హ్యాక్..!

ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్నారు. ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో పాటు కెరీర్ కి సంబంధించిన సంగ‌తుల‌ని అందులో షేర్ చేస్తున్నారు. అయితే కొన్ని సార్లు వారి అకౌంట్స్ హ్యాక్‌కు గురికావ‌డం నెటిజ‌న్స్‌ని క‌ల‌వ‌రప‌రుస్తుంది. తాజాగా ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్ త‌నయ వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి. ఈ విష‌యాన్ని ప్ర‌క‌ట‌న ద్వారా తెలియ‌జేసింది.

నా అభిమానులు, మీడియాకు నా విన్న‌పం ఏమంటే.. నా సామాజిక మాధ్య‌మాలు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్ట‌ర్ అకౌంట్స్ హ్య‌క్ అయ్యాయి. గ‌త రాత్రి నుండి నేను వాటిని ఉప‌యోగించ‌లేక‌పోతున్నాను. నా టెక్నిక‌ల్ టీం స‌మ‌స్య‌ని సాల్వ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీలైనంత త్వర‌గా అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే నా ఫాలోవ‌ర్స్‌కు విన్న‌వించేది ఏమంటే నా అకౌంట్స్ నుండి ఏవైన మెసేజెస్ వ‌స్తే వాటికి రెస్పాండ్ కావొద్దు. నా అకౌంట్స్ నా అధీనంలోకి రాగానే మీకు తెలియ‌జేస్తాను. మీ స‌పోర్ట్ నాకు ఎల్ల‌ప్పుడు ఇలానే ఉండాలి. త్వ‌ర‌లోనే మ‌ళ్ళీ ఆన్‌లైన్‌లో క‌లుస్తాను అని వ‌ర‌ల‌క్ష్మీ పేర్కొంది.


logo