బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 20:22:01

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన నటి శృతిహాసన్‌

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన నటి శృతిహాసన్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ను నటి శృతిహాసన్‌ స్వీకరించారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని తన నివాసంలో బుధవారం మూడు మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడారు. ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 

ఇటీవలే సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన బర్త్‌డే సందర్భంగా, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌ తనకు విసిరిన హరిత సవాల్‌ను స్వీకరించి, తనవంతు బాధ్యతగా మూడు మొక్కలు నాటినట్లు శృతిహాసన్‌ పేర్కొన్నారు. తనను నామినేట్‌ చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం ఆమె బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌రోషన్‌, హీరోయిన్‌ తమన్నా, టాలీవుడ్‌ హీరో దగ్గుబాటి రానాకు గ్రీన్‌ చాలెంజ్‌ విసిరారు. 


logo