శుక్రవారం 23 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 01:04:06

ఆనందానికి అర్థం తెలుసుకున్నా

ఆనందానికి అర్థం తెలుసుకున్నా

సినిమాల తాలూకు విజయాలు, వాటి కోసం పడిన కష్టం నాలో  నిరంతరం స్ఫూర్తిని నింపుతూ ముందడుగు వేసేలా చేస్తాయని అనుకునేదాన్ని. కొన్నిసార్లు చిన్న పనులు జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపకరిస్తాయని లాక్‌డౌన్‌ విరామంతో అవగతమైంది’ అని తెలిపింది సమంత.  లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు దూరమైన సమంత ప్రస్తుతం సొంత బ్రాండింగ్‌, గార్డెనింగ్‌ పనులతో బిజీగా ఉంది.  ఈ విరామంలో తనకు ఎదురైన అనుభవాలపై సమంత మాట్లాడుతూ ‘గార్డెనింగ్‌ నాకు చాలా ఇష్టమైన వ్యాపకం. ఇదివరకు సినిమాలతో బిజీగా ఉండటంతో మొక్కల్ని పెంచడానికి సమయం దొరికేది కాదు.  లాక్‌డౌన్‌  విరామంలో మొక్కల పెంపకంపై ఎక్కువ దృష్టిపెట్టా. ఇలాంటి చిన్న పనులు ఆశావాహదృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలుసుకున్నా. చేసే పని ఏదైనా అంకితభావంతో శ్రమిస్తుంటా.  అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటా. ఆ సంతృప్తి లేకపోతే ఏది చేయను.  బంధాల్ని మరింత బలపరుచుకోవడానికి లాక్‌డౌన్‌ సమయం తోడ్పడింది. ఈ విరామంలో అనుబంధాల విలువ తెలుసుకున్నా’ అని తెలిపింది. 


logo