శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 16, 2020 , 08:02:14

అభిమానుల‌కి ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరిన రోజా

అభిమానుల‌కి ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరిన రోజా

ఒక‌ప్పుడు స్టార్ క‌థానాయిక‌గా ఓ వెలుగు వెలిగిన రోజా ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌కి ప‌రిమిత‌మైంది. అడ‌పాద‌డ‌పా టీవీ షోస్‌తో అలరిస్తుంది. అయితే లాక్‌డౌన్ వ‌ల‌న ఇంటికి ప‌రిమిత‌మైన రోజా ఇటీవ‌ల తాను చేసిన ప‌లు వంట‌కాల‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని థ్రిల్ చేసింది. తాజాగా త‌న ఇంట్లో చేస్తున్న ఎక్స‌ర్‌సైజ్ కి సంబంధించిన వీడియో షేర్ చేసింది.

ఈ వీడియోలో డంబెల్స్‌తో చాలా ఈజీగా వర్కౌట్ చేస్తూ.. చెమటలు చిందిస్తుంది.  మోచేతులపై శరీరాన్ని మొత్తం ఆల్చి ఒక్క నిమిషం పాటు అలాగే ఉన్న రోజా.. వన్ మినిట్ ప్లాంక్ ఛాలెంజ్ నేను చేశా మరి మీరు అంటూ వీడియో వదలింది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆమెలానే వీడియోస్ చేస్తూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు .logo