ఆదివారం 31 మే 2020
Cinema - May 01, 2020 , 15:08:27

ఆ సినిమాను పదిసార్లు చూశా! : ప్ర‌ణీత

ఆ సినిమాను పదిసార్లు చూశా! : ప్ర‌ణీత

హీరోయిన్‌ ప్రణీత... ఆ పేరు వినగానే అందమైన కళ్ళు..పాలకోవల్లాంటి బుగ్గలు, మళ్లీ మళ్లీ చూడాలనిపించే నవ్వు గుర్తొస్తాయి. చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈమె గురించి ఎందుకు ప్రస్తావన అనకుంటున్నారా?.. ప్రణీతకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. అందులో ఆమె అల్లు అర్జున్‌ గురించి, అల వైకుంటపురం సినిమా, అందులోని పాటల గురించి చెబుతుంది.  అలవైకుంఠ పురం సినిమాను ఇప్ప‌టివ‌ర‌కు 10 సార్లు చూసిందట‌. అంతేకాదు అందులోని సామ‌జవ‌ర‌గ‌మ‌ణ పాటంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని చెబుతూ త‌న స్టైల్‌లో పాడేస్తోంది. ప్రణీత తన రీల్ విష‌యాల‌తోపాటు రియ‌ల్ విష‌యాలు పంచుకున్న‌ వీడియో నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న‌ది.

ప్రస్తతం ప్ర‌ణీత‌ పెద్ద‌గా సినిమాలు కూడా చేయట్లేదు. ఈమె రెమ్యూనరేషన్‌ కూడా తక్కువనే తీసుకుంటుందట. లాక్‌డౌన్‌ టైంలో పేదవాళ్లకు ఏదైనా చేయాలనే ఆలోచనతో హెల్ప్ ది హెల్పింగ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ మొదలు పెట్టిందట. అంటే.. మనకు హెల్స్‌ చేసే ఆటో డ్రైవ‌ర్లు, కూలీలు, షూటింగ్‌ టైంలో లైట్‌ బాయ్స్‌, అసిస్టెంట్స్‌ వాంటి వారికి సహాయం చేయాడానికి ఈ ఛాలెంజ్‌ మొదలు పెట్టినట్లు చెప్పింది.  దీనికి స్పందన బాగానే వచ్చిందని,  ఇప్ప‌టివ‌ర‌కు 7.4 ల‌క్ష‌లు సేక‌రించిన‌ట్లు ప్ర‌ణీత పేర్కొంది. లాక్‌డౌన్‌లో పేద‌ప్ర‌జ‌ల‌కు అవసరమైన మెడిసిన్‌, కూరగాయలు, పండ్లు వంటి రోజువారీ అవ‌స‌రాలు తీర్చేందుకు ఈ డ‌బ్బును వారి ఖాతాల్లో వేస్తామ‌ని తెలిపింది.logo