గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో నటి మీనా

చెన్నై: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అప్రతిహతంగా కొనసాగుతున్నది. సామాన్యుల నుంచి సినీ నటులు, రాజకీయ నాయకుల వరకు చాలెంజ్‌లు విసురుతూ మొక్కలు నాటుతున్నారు. ఇందులో భాగంగా యాంకర్, బిగ్‌బాస్ షో 4 ఫేం దేవి నాగవల్లి విసిరిన చాలెంజ్‌ను ప్రముఖ నటి మీనా స్వీకరించారు. చెన్నైలోని సైదాపేట్‌లో ఉన్న తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మనందరం బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి కోరారు.
ఇంత మంచి కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న ఎంపీ సంతోష్‌కు అభినందనలు తెలిపారు. ఈ చాలెంజ్ ఇదే విధంగా ముందుకు కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరో వెంకటేష్, కన్నడ హీరో సుదీప్, మళయాళ హీరోయిన్ మంజు వారియర్, హీరోయిన్ కీర్తి సురేష్‌లకు చాలెంజ్ విసిరారు. మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
- బెంగాల్ పోరు : తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి
- 13 అడుగుల భారీ కొండచిలువ కలకలం..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’
- బీజింగ్‌కు చెక్ : డ్రాగన్ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆచితూచి నిర్ణయం!
- బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు
- ‘సీటీమార్’ టైటిల్ ట్రాక్‌కు ఈల వేయాల్సిందే