బుధవారం 02 డిసెంబర్ 2020
Cinema - Aug 22, 2020 , 19:33:04

ఇంట్లో గ‌ణేశుడి పూజ‌..ఇదే తొలిసారి

ఇంట్లో గ‌ణేశుడి పూజ‌..ఇదే తొలిసారి

మిస్ వ‌ర‌ల్డ్ (2017), బాలీవుడ్ న‌టి మానుషి చిల్లార్ గ‌ణేశ్ చ‌తుర్థి వేడుకల్లో పాల్గొంది. వివిధ సంస్కృతుల‌కు సంబంధించిన వేడుకల్లో పాల్గొనడం అంటే నా త‌ల్లిదండ్రుల‌కు చాలా ఇష్టం. నేను హ‌ర్యానా వ్య‌క్తిని. ముంబై కూడా నా సొంతిల్లులాంటిదే. ముంబైలో జ‌రిగే గ‌ణేశ్ చ‌తుర్థి వేడుక‌ల్లో పాల్గొన‌డ‌మంటే నాకిష్టం. ముంబైలోనే తొలిసారి వినాయ‌క చ‌వితి వేడుక‌ల్లో పాల్గొన్నాను. వినాయ‌క ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌డంలో మ‌హారాష్ట్ర ప్ర‌జ‌లు చూపించే ఆస‌క్తి, ప్రేమ చాలా ప్ర‌త్యేకం.

గ‌ణేశ్ చ‌తుర్థిని ఇంట్లో నిర్వ‌హించాల‌ని అమ్మానాన్న‌తో చెప్పాను. వారు వెంట‌నే సరే అని చెప్పారు. అందుకే ఇంట్లో వినాయ‌క చ‌వితిని జ‌రుపుకోవ‌డం మొద‌టిసారి. ఇది నాకు చాలా ప్ర‌త్యేక‌మైన స‌మ‌యం. అందరి శాంతి, శ్రేయ‌స్సు కోసం గ‌ణేశుడిని ప్రార్థిస్తున్న‌ట్టు మానుషి చిల్లార్ చెప్పింది.  లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.