గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 12, 2020 , 17:05:47

బాలీవుడ్ న‌టికి క‌రోనా పాజిటివ్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌‌!

బాలీవుడ్ న‌టికి క‌రోనా పాజిటివ్‌.. అంద‌రూ జాగ్ర‌త్త‌‌!

బాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు, టెలివిజ‌న్‌లో క‌నిపించే న‌టి హిమానీ శివ‌పురికి క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ అయింది. ఈ రోజు ఉద‌యం ఆమె ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. 'గుడ్ మార్నింగ్‌, నాకు క‌రోనా ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని వ‌చ్చింది. నాతో ప‌రిచ‌యం ఉన్న‌వాళ్లు, క‌లిసిన వాళ్లు ఎవ‌రైనా ఉంటే వారు ద‌య‌చేసి క‌రోనా ప‌రీక్ష చేయించుకోండి' అని విన్న‌పించారు హిమానీ.

.హిమానీ 'హ‌స్ర‌టిన్'‌, 'ఘ‌ర్ ఏక్ స‌ప్నా' వంటి అనేక ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసింది. అలాగే 'హ‌మ్ ఆప్కే హై కౌన్', 'దిల్వాలే దుల్హానియా లే జ‌యేంగే', 'పార్డెస్' వంటి అనేక చిత్రాల్లో హిమానీ న‌టించారు. క‌ర‌ణ్ జోహార్ డైరెక్ట్ చేసిన కుచ్ కుచ్ హోతా హైలో రిఫాత్ బీ పాత్ర‌కు మంచి పేరు తెచ్చి పెట్టింది.