‘తోటకూర, గోంగూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు..’ తెల్లవారుజామునే పట్నం వీధుల్లో వినిపించే కేక. పల్లె, పట్నం ఏదైనా మనకు కావలసింది ఆరోగ్యకరమైన జీవనం. అందుకు సోపానాలే ఆకుకూరలు. వీటిలో పోషకాలు, విటమిన్లు అపారం. అందుకే రోజువారీ ఆహారంలో ఆకుకూరలను తప్పక తీసుకోవాలంటున్నారు నిపుణులు. అయితే, మనం కొన్ని ఆకు కూరలను మాత్రమే తరచుగా తింటాం. అరుదుగా కనిపించే సోయకూరలోనూ చాలా పోషకాలుంటాయి.