సోమవారం 08 మార్చి 2021
Cinema - Jan 17, 2021 , 00:51:26

పెళ్లి తర్వాత హ్యాపీ

పెళ్లి తర్వాత హ్యాపీ

‘ఉమ్మడి కుటుంబంలోని అనుబంధాల్ని ఆవిష్కరిస్తూ ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ చిత్రాన్ని రూపొందించారు. అభినయానికి ఆస్కారమున్న మంచి చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది కథానాయిక అర్చన. సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ నెల 29న విడుదలకానుంది. ఈ చిత్రంలో తనకు గొప్ప పాత్ర లభించిందని ఆనందం వ్యక్తం చేసింది అర్చన. ఆమె మాట్లాడుతూ ‘కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. ఇందులో నేను మెడికల్‌ విద్యార్థినిగా కనిపిస్తా. ప్రేమించినవాడి కోసం ఎంతదూరమైనా వెళ్లే యువతిగా నా పాత్ర ఛాలెంజింగ్‌గా ఉంటుంది. నేటి సమాజంలో జరుగుతున్న పరువు హత్యలను కూడా ఈ సినిమాలో చర్చించాం. పెళ్లయిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నా. నా భర్త దృష్టిలో నేనే సూపర్‌స్టార్‌. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటున్నా. సినిమాలపరంగా మంచి అవకాశాలొస్తున్నాయి’ అని చెప్పింది.


VIDEOS

logo