శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 17, 2020 , 16:04:33

యాక్టర్లు ఈగో వల్లే ఆడిషన్స్‌కు వెళ్లరేమో..!

యాక్టర్లు ఈగో వల్లే ఆడిషన్స్‌కు వెళ్లరేమో..!

ముంబై: ఇటీవలే అంగ్రేజి మీడియం సినిమాతో ప్రేక్షకుల ముందుకుకొచ్చింది అందాల తార రాధికా మదన్‌. రాధికా మదన్‌ ఈ చిత్రంలో ఇర్ఫాన్‌ఖాన్‌ కూతురిగా  అందరినీ మెప్పించి..తనకంటూ ప్రత్యేకంగా ఫాలోవర్లను సంపాదించింది. అయితే చాలా మంది నటీనటులు ఆడిషన్స్‌కు వెళ్లేందుకు ఆలోచిస్తుంటారని, దీనికి వారికున్న ఈగోకానీ, అభద్రతాభావం కానీ అయ్యి ఉండొచ్చని చెప్పింది.

‘నేను ఈ పొజిషన్‌లో ఉన్నా..ఆడిషన్‌కు వెళ్లడం మానను. ఆడిషన్‌ అంటే నాకిష్టం. ఎందుకంటే ఆడిషన్‌లో పాల్గొంటే సినిమాలో నా పాత్రను చేయగలగన్న నమ్మకం ఏర్పడుతుంది. ఆడిషన్‌ లో పాల్గొన్నపుడు నిర్మాతలకు నేనేం చేయగలనో తెలుస్తుంది. పటాఖా, మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా చిత్రాల ద్వారా కాస్టింగ్‌ డైరెక్టర్లు ఆడిషన్‌ కావాలి..ఆడిషన్‌ కు రావాలనుకుంటున్నారా..? అడిగినపుడు..ఒకే వస్తాను. నేనిపుడు రావాలా..? ఓ సారి స్క్రిప్ట్‌ పంపించండి అంటే..వారు సరేనని చెప్తారని’ చెప్పుకొచ్చింది రాధికామదన్‌. 
logo