శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 18, 2020 , 07:20:48

తల్లికి క‌రోనా.. స్వీయ నిర్భందంలో బాలీవుడ్ న‌టుడు

తల్లికి క‌రోనా.. స్వీయ నిర్భందంలో బాలీవుడ్ న‌టుడు

బాలీవుడ్ సెల‌బ్రిటీల‌ని క‌రోని ప‌ట్టి పీడిస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌ముఖ సింగర్ క‌నికా, నిర్మాత మొరానీ ఆయ‌న కూతుళ్ళు ఇద్దరికీ క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ యాక్టర్ స‌త్య‌జిత్ దూబే(ప్ర‌స్థానం ఫేమ్‌) త‌ల్లికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజులుగా త‌ల‌నొప్పి, హై ఫీవ‌ర్, ఒళ్లు నొప్పులు రావ‌డంతో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ అని తేలింది. ప్ర‌స్తుతం ఆమెకి నానావ‌తి ఆసుప‌త్రిలోని ఐసోలేష‌న్ వార్డ్‌లో చికిత్స అందిస్తున్నారు. 

అమ్మ‌కి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో నేను, నా సోద‌రి హోం క్వారంటైన్‌లో ఉన్నాము. ప్ర‌స్తుతానికి మా ఇద్ద‌రికి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. ప్ర‌తి రోజు ఫోన్, వీడియో కాల్ ద్వారా మా అమ్మ‌తో ట‌చ్‌లో ఉంటున్నాం. ఆమె త్వర‌లోనే కోలుకుంటుంద‌ని భావిస్తున్నాం. ఇలాంటి ప‌రిస్థితులు వ‌స్తాయ‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని స‌త్య‌జిత్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలియ‌జేశాడు.


logo