బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 12, 2020 , 11:43:25

బాలీవుడ్‌ ‘మున్నాభాయ్‌‌’కి స్టేజ్‌-౩ లంగ్‌ క్యాన్సర్‌

బాలీవుడ్‌ ‘మున్నాభాయ్‌‌’కి స్టేజ్‌-౩ లంగ్‌ క్యాన్సర్‌

ముంబై : బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌ స్టేజ్‌-౩ లంగ్‌ క్యాన్సర్‌ బారినపడ్డారు. మూడు రోజుల కిందట శ్వాసకోస, ఛాతిలో ఇబ్బందులతో ఆయన ముంబై లీలావతి దవాఖానలో చేరగా, సోమవారం డిశ్చార్జి అయ్యారు. అలాగే కరోనా నిర్ధారణ, ఇతర పరీక్షలు నిర్వహించారు. ఇందులో కరోనా నెగటివ్‌ రాగా, మంగళవారం వచ్చిన ఫలితాల్లో స్టేజ్‌-3 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. కాగా, ఆయన ట్విట్టర్‌లో ‘వైద్య చికిత్స కోసం స్వల్ప విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, స్నేహితులు నాతో ఉన్నారు. ఎవరూ బాధపడొద్దు. అవసరంగా ఊహాగానాలు చేయొద్దని నా శ్రేభిలాషులను కోరుతున్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలతో నేను త్వరలో తిరిగి వస్తాను’ అని ట్వీట్‌ చేశారు. దీంతో ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారన్న వార్తలకు బలాన్ని ఇచ్చాయి. ఆయన బుధవారం చికిత్స కోసం అమెరికాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా,  సంజయ్ దత్ తాజా చిత్రం ‘సడక్ 2’తోపాటు అజయ్ దేవ్‌గన్‌తో కలిసి నటించిన ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ డిస్నీ హాట్‌స్టార్‌ ప్రీమియంలో ప్రసారం కానున్నాయి.


తాజావార్తలు


logo