హైదరాబాద్, ఏప్రిల్ 8: ఆర్థిక ఫలితాల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.301 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.230 కోట్లతో పోలిస్తే భారీగా పెరిగింది. ఇదే సమయంలో రూ.10,109.15 కోట్ల డిపాజిట్లు, రూ.10,103.82 కోట్ల అడ్వాన్స్‌లు కలిగివున్నది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 1.58 శాతం నుంచి 2.25 శాతానికి ఎగబాకాయి.