గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 00:32:33

అది నా బాధ్యత

అది నా బాధ్యత

అందంతో పాటు అభినయం కూడా తెలిసిన నాయికలు చాలా అరుదుగా వుంటారు. ఆ జాబితాలోనే ఉంటుంది కథానాయిక రెజీనా. ప్రతి సినిమాలో తన నటనకు మంచి మార్కులే సాధిస్తుంది ఈ భామ. అయితే కేవలం ఒకే తరహా పాత్రల మూసలో ఉండకుండా అభినయంతో పాటు గ్లామర్‌ పాత్రలను కూడా చేయడానికి రెజీనా ప్రాధాన్యతనిస్తుంది. అయితే గ్లామర్‌ పాత్రలు పోషిస్తే హీరోయిన్స్‌ ఎక్కువ సంవత్సరాలు చిత్ర సీమలో కొనసాగుతారనే అపోహ కొందరిలో ఉంది. ఇదే విషయాన్ని రెజీనా దగ్గర ప్రస్తావిస్తే ‘నటనలో అడుగుపెట్టిన తర్వాత అన్ని రకాల పాత్రలు చేయాలన్నది నా సిద్ధాంతం. అది నా బాధ్యత కూడా. చాలా మంది గ్లామర్‌ రోల్స్‌, అభినయ ప్రధాన పాత్రలు వేరుచేసి చూస్తారు. అలా ఎందుకనేది ఇప్పటికీ అర్థం కాలేదు.  ఒక్కసారి గ్లామర్‌ రోల్స్‌ చేస్తే అందరూ ఆ యాంగిల్‌నే ఆలోచిస్తారు. తమిళంలో ఇప్పటివరకు గ్లామర్‌ పాత్రలు చేయలేదు. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'లో గువ్వగోరింకా, యాష్‌కరింగే పాటలు చూసి కోలీవుడ్‌ ఫ్రెండ్స్‌ అందరూ అది చేసింది నేనేనా అని ఆశ్చర్యపోయారు’ అంటూ చెప్పుకొచ్చారు ఈ అందాలభామ logo