సినిమా బిడ్డల ప్యానెల్ ప్రకటించిన ప్రకాష్‌రాజ్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమరం మొదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో ప్రకాష్‌రాజ్ తన సినిమా బిడ్డల ప్యానల్‌ను ప్రకటించారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షబరిలో నిలవబోతున్నట్లుగా జీవితరాజశేఖర్, హేమ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అనూహ్యంగా ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి హేమ వైస్ ప్రెసిడెంట్‌గా, జనరల్ సెక్రటరీగా జీవితరాజశేఖర్ పోటీచేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘ రెండు నెలల సమయంలో అసోసియేషన్‌లోని ప్రతి ఒక్క సభ్యుడిని కలిసి ‘మా’ అభివృద్ధి కోసం ఏం చేయాలో చర్చించాం. ఆ తర్వాతే ప్యానల్లో ఎవరూ ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. అలంకారాలు, పెద్ద పేర్లు ప్యానల్లో ఉండాలని మేము కోరుకోలేదు. రాబోయే రెండేళ్లలో అసోసియేషన్ కోసం సమయాన్ని కేటాయిస్తూ ఎవరూ పనిచేయగలుగుతారో ఆలోచించి వారికే ప్యానల్లో చోటు కల్పించాం. సినిమా, టీవీ, రంగస్థలం ఇలా అన్ని విభాగాలకు ప్రాతినిధ్యం వహించేలా సినిమా బిడ్డల ప్యానల్ ఉండాలని కోరుకున్నాం. ‘మా’ అసోసియేషన్ మూడు, నాలుగు విభాగాలుగా విడిపోకూడదనే ఆలోచనతో మా కలల్ని, ఆలోచన విధానాన్ని జీవితరాజశేఖర్కు వివరించాం. ఐక్యంగా పనిచేయగలమనే నమ్మకం కలగడంతో ఆమె మా ప్యానల్ నుంచి పోటీచేయడానికి అంగీకరించారు.
హేమ ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. మేము చేయాలనుకున్న పని నచ్చడంతో మాతో కలిసి నడవడానికి ఆమె అంగీకరించారు. మహిళా సభ్యుల ప్రాతినిధ్యం ఉండాలనే హేమ, జీవితరాజశేఖర్, అనసూయ, ప్రగతి, అనితాచౌదరికి అవకాశం ఇచ్చాం. ముక్కుసూటిగా మాట్లాడేవారు ఈ ప్యానల్లో ఉన్నారు. మా ఎజెండా ఏమిటనేది త్వరలో అందరికీ చెబుతాం. ఎన్నికల లోపు ఎవ్వరికీ ఏ అనుమానం ఉన్నా, ప్రశ్నలు ఉన్నా..నాతో పాటు బెనర్జీ, జయసుధ, జీవితరాజశేఖర్, సాయికుమార్, బండ్లగణేష్ మాత్రమే సమాధానాలు చెబుతారు. విభజన మా ఎజెండా కాదు’ అన్నారు. ప్రకాష్‌రాజ్ ప్యానల్ వివరాలు ఇలా ఉన్నాయి…అధ్యక్షుడు-ప్రకాష్‌రాజ్, వైస్ ప్రెసిడెంట్-బెనర్జీ, హేమ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్-శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ-జీవితరాజశేఖర్, ట్రెజరర్-నాగినీడు, జాయింట్ సెక్రటరీ-అనితాచౌదరి, ఉత్తేజ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ-అనసూయ, అజయ్, భూపాల్, బ్రహ్మాజీ, ఈటీవీ ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యూమ్, కౌశిక్, ప్రగతి, రమణారెడ్డి, శివారెడ్డి, సమీర్, సుడిగాలిసుధీర్, డి.సుబ్బరాజు, సురేష్ కొండేటి, తనీష్, టార్జాన్, శ్రీధర్‌రావు,