అగ్ర నటుడు ప్రకాష్‌రాజ్ చెన్నైలో జరుగుతున్న ఓ తమిళ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. క్రిందపడటంతో చిన్న ఫ్రాక్చర్ అయిందని, హైదరాబాద్‌లో సర్జరీ చేయించుకోబోతున్నట్లు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్లో తెలిపారు. ‘ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. చిన్నపాటి ఫ్రాక్చర్ ఏర్పడింది. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని నా మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి దగ్గరకు వస్తున్నా’ అని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ధనుష్ కథానాయకుడిగా మిత్రన్ జవహర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘చిరుచిత్రంబళమ్’లో ప్రకాష్‌రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే చెన్నైలో చిత్రీకరణ మొదలైంది. ఈ సినిమా షూటింగ్‌లోనే ప్రకాష్‌రాజ్ గాయపడ్టట్లు తెలిసింది. ప్రకాష్‌రాజ్ త్వరలో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేయబోతున్న విషయం తెలిసిందే.