మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 00:24:28

రేంజ్‌రోవర్‌ బహుమతి

రేంజ్‌రోవర్‌ బహుమతి

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ తన జిమ్‌ ట్రైనర్‌ లక్ష్మణ్‌రెడ్డికి ఖరీదైన రేంజ్‌ రోవర్‌ కారును బహుమతిగా అందించి గొప్ప మనసును చాటుకున్నారు. లక్ష్మణ్‌ గత  ఎనిమిదేళ్లుగా ప్రభాస్‌ వ్యక్తిగత జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. లక్ష్మణ్‌ అందించిన శిక్షణ ద్వారానే ప్రభాస్‌ ‘బాహుబలి’ చిత్రంలో సిక్స్‌ప్యాక్‌లో మెప్పించారు. తన శ్రేయోభిలాషులు పట్ల ప్రభాస్‌ అమితమైన ప్రేమాభిమానాలు కనబరుస్తుంటారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. లక్ష్మణ్‌రెడ్డికి అందించిన ఖరీదైన బహుమతితో ప్రభాస్‌ మరోమారు తన స్నేహశీలతను చాటుకున్నారని ప్రభాస్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
logo