గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 13:54:28

జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌ని క‌లిసిన పాయ‌ల్ ఘోష్‌

జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌ని క‌లిసిన పాయ‌ల్ ఘోష్‌

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని కొద్ది రోజుల క్రితం పాయ‌ల్ ఘోష్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ కేసు విష‌యంలో ఢిల్లీలోని జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌ని క‌లిసింది పాయ‌ల్‌. కేసు విష‌యం, గ‌తంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌లని గురించి చ‌ర్చించిన‌ట్టు వివ‌రించింది. వీలైనంత త్వ‌ర‌గా ఈ కేసుకి సంబంధించి విచార‌ణ పూర్తి చేయాల‌ని పాయ‌ల్ కోరుతుంది. 

ఇక లైంగిక వేధింపుల కేసులో భాగంగా వెర్సోవా పాలసీ స్టేషన్‌లో కశ్య‌ప్‌ను దాదాపు ఎనిమిది గంటలు విచారించిన విష‌యం విదిత‌మే. ఈ విచార‌ణ‌లో ఆయ‌న పాయ‌ల్ వ్యాఖ్య‌ల‌ని ఖండిస్తూ, ఆ స‌మ‌యంలో తాను వేరే దేశంలో ఉన్న‌ట్టు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పాయ‌ల్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా .. క‌శ్య‌ప్ పోలీసుల ముందు అబ‌ద్దాలు చెప్పాడు. నిజ‌నిజాలు బ‌య‌ట‌ప‌డాలంటే క‌శ్య‌ప్‌ని  నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని కోరుతున్నాను అని పేర్కొంది.


logo