శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Sep 06, 2020 , 16:44:08

నిఖిల్ కుమార్ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

నిఖిల్ కుమార్ మూవీ ఫస్ట్ లుక్ డేట్ ఫిక్స్

మాజీ ప్ర‌ధాని హెచ్‌.డి. దేవెగౌడ మ‌న‌వ‌డు, క‌ర్నాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి కుమారుడు నిఖిల్ కుమార్, విజ‌య్ కుమార్ కొండా కాంబినేష‌న్ లో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ ను సెప్టెంబ‌ర్ 11న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఆదివారం ఓ పోస్ట‌ర్ ద్వారా చిత్ర బృందం తెలియ‌జేసింది. నిఖిల్ కుమార్ కు జోడీగా క‌శ్మీరా ప‌ర‌దేశి న‌టిస్తోంది. 

నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న నాలుగో చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ సినిమా ద్వారా పాపుల‌ర్ మ్యూజిక్ కంపెనీ ల‌హ‌రి మ్యూజిక్ అధినేత చంద్రు మ‌నోహ‌ర‌న్‌ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. అర్జున్ జ‌న్యా సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి శ్రీష ఎం. కుడువ‌ల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేస్తున్నారు.తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో ఏక కాలంలో ఈ మూవీ నిర్మాణ‌మ‌వుతోంది.

తారాగ‌ణం:

నిఖిల్ కుమార్‌, క‌శ్మీరా ప‌ర‌దేశి, ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్‌, చిక్క‌న్న‌, శివ‌రాజ్ కె.ఆర్‌. పీట్‌, నిహారిక‌, సంప‌ద హుళివ‌న‌, అనూష‌

సాంకేతిక బృందం:

ర‌చ‌న‌: న‌ంద్యాల ర‌వి, విజ‌య్ ప్ర‌కాష్‌

డైలాగ్స్‌, కో-డైరెక్ట‌ర్‌:  శ‌ర‌త్ చ‌క్ర‌వ‌ర్తి

మ్యూజిక్‌: అర్జున్ జ‌న్యా

సినిమాటోగ్ర‌ఫీ: శ్రీ‌ష ఎం. కుడువ‌ల్లి

ఎడిటింగ్‌:  కె.ఎం. ప్ర‌కాష్‌

స్టంట్స్‌:  డాక్ట‌ర్ ర‌వివ‌ర్మ‌

ఆర్ట్‌:  మోహ‌న్ బి. కెరే

క్రియేటివ్ హెడ్‌:  సునీల్ గౌడ‌

నిర్మాత‌: చ‌ంద్రు మ‌నోహ‌ర‌న్‌

క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  విజ‌య్ కుమార్ కొండా
logo