సోమవారం 06 జూలై 2020
Cinema - May 28, 2020 , 17:52:12

సినీ, టీవీ రంగాన్ని గట్టెక్కించడంపై చర్చలు: నరేశ్‌

సినీ, టీవీ రంగాన్ని గట్టెక్కించడంపై చర్చలు: నరేశ్‌

హైదరాబాద్‌: సినీ, టీవీ రంగాన్ని గట్టెక్కించే అంశంపై చర్చలు జరిగాయని నటుడు నరేశ్‌ అన్నారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలో మంత్రి తలసానితో సినీ, టీవీ రంగ ప్రముఖులు సమావేశమయ్యారు. అనంతరం నటుడు నరేశ్‌ మాట్లాడుతూ.. సినిమా, టీవీ రంగం సమస్యలను మొన్న సీఎం దృష్టికి తీసుకెళ్లాం. సీఎం వెంటనే స్పందించి చర్చలు జరుపాలని సీఎస్‌, అధికారులకు చెప్పారు. చిత్ర పరిశ్రమ తిరిగి ప్రారంభించిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నరేశ్‌ అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలోని కార్మికులను చాలా మంది చాలా రకాలుగా ఆదుకుంటున్నారు. షూటింగ్‌ల్లో భౌతికదూరం పాటించడం కాస్త కష్టమైన పని అన్నారు.

 తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూనే..బాధ్యతలను సినిమా పరిశ్రమకు అప్పగించిందని నరేశ్‌ పేర్కొన్నారు. మీరు షూటింగ్‌ చేసుకోవడానికి మాకెలాంటి ఇబ్బంది లేదు. మీరే నిబంధనలు పెట్టుకోండి. మీరు ఏవిధంగా భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు జరుపుతారో ఆలోచన చేయాలని ప్రభుత్వం మాకు సూచించింది. తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు సినీపరిశ్రమ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo