గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 00:09:30

లవకుశ నాగరాజు కన్నుమూత

లవకుశ నాగరాజు కన్నుమూత

సీనియర్‌ సినీ నటుడు ‘లవకుశ’ నాగరాజు కన్నుముశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీ నగర్‌లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్‌, అంజలిదేవి జంటగా 1963లో సి.పుల్లయ్య, సి.ఎస్‌.రావు దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ చిత్రంలో లవుడి పాత్రలో నటించారు నాగరాజు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రిని ఎదురించే సాహసం కలబోతగా సాగే పాత్రలో అద్వితీయ అభినయాన్ని కనబరిచి మెప్పించారు. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌తో నాగరాజుకు చక్కటి అనుబంధం ఏర్పడింది. అనంతర కాలంలో ఎన్టీఆర్‌తో కలిసి ఇంద్రజీత్‌, భీష్మ, టైగర్‌రాముడు, భామవిజయం, శ్రీకృష్ణసత్యతో పాటు నలభై వరకు సినిమాలు చేశారు నాగరాజు. నారదుడిగా పలు సినిమాల్లో నటించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ భాషల్లో 340కిపైగా సినిమాలు చేశారు. నాగరాజుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగరాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తంచేశారు. 





logo