శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 18:56:47

నిహారిక వెడ్డింగ్ ఈవెంట్ అక్క‌డే..!

నిహారిక వెడ్డింగ్ ఈవెంట్ అక్క‌డే..!

టాలీవుడ్ న‌టుడు నాగబాబు కూతురు నిహారిక‌ త్వ‌ర‌లో పెండ్లి పీట‌లెక్క‌నున్న విష‌యం తెలిసిందే. గుంటూరుకి చెందిన‌  పోలీస్‌ ఆఫీసర్‌ కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఏడ‌డుగులు వేయ‌నుంది. నిహారిక పెండ్లి వేడుకను డెస్టినేష‌న్ వెడ్డింగ్ గా జ‌రుపాల‌ని మెగాఫ్యామిలీ ప్లాన్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ ఎక్క‌డ నిర్వ‌హిస్తారనే దానికి సంబంధించిన న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

గోవాలో వెడ్డింగ్ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని నిహారిక అనుకుంటుంద‌ట‌. మీడియాకు దూరంగా కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో త‌న పెండ్లిని జ‌రుపుకోవాల‌నుకున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. గోవా సెల‌బ్రిటీల‌కు ఫేవరేట్ హాలీడే స్పాట్ అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దేశంలోనే క‌రోనా కేసులు అతిత‌క్కువ‌గా ఉండ‌టంతో గోవాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి దీనిపై నాగ‌బాబు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.