గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 08, 2020 , 00:09:32

కోటి మొక్కల రామయ్య స్ఫూర్తి

కోటి మొక్కల రామయ్య స్ఫూర్తి

ఎంపీ సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ఇండియా   చాలెంజ్‌లో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని చెప్పారు నటుడు నాగబాబు. సోమవారం గ్రీన్‌ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న ఆయన మణికొండలోని తన నివాస ఆవరణలో మూడు మొక్కలు నాటారు.  అనంతరం నాగబాబు మాట్లాడుతూ ‘చెట్ల పెంపకం నాకు ఇష్టమే.   ఏకో ఫ్రెండ్స్‌ ఆర్గనైజేషన్‌తో పాటు మెగా ఫ్యాన్స్‌తో కలిసి వివిధ ప్రాంతాల్లో ఇరవై వేలకుపైగా మొక్కలను నాటించాను. చెట్ల పెంపకంలో కోటి మొక్కల రామయ్య నాకు స్ఫూర్తి. తనకున్న కొద్దిపాటి భూమిని అమ్మి కోటికిపైగా మొక్కలు నాటారాయన.  రామయ్య అంతగా కాకపోయినా యాభై వేల మొక్కలైనా నాటాలన్నది నా జీవితాశయం’ అని తెలిపారు. ఈ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కు టీవీ నటులు భరణి, కాళికిరాజులను నాగబాబు నామినేట్‌ చేశారు. 
logo