మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 13:24:21

ముంబై నుంచి మనాలికి ప్రయాణమైన కంగనా

ముంబై నుంచి మనాలికి ప్రయాణమైన కంగనా

ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన సొంత ఊరైన హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి ప్రయాణమైంది. సోమవారం ఉదయం ముంబై నుంచి విమానంలో చండీగఢ్ చేరుకున్నది. అక్కడికి నుంచి రోడ్డు మార్గంలో మనాలికి బయలుదేరింది. కంగనా కొంత కాలం మనాలిలోనే ఉంటుందని సమాచారం. సుశాంత్ సింగ్ మరణం కేసులో డ్రగ్స్ వ్యవహారంపై కంగనా ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. కాగా, కంగనా వ్యాఖ్యలను శివసేన ఖండించింది. మహారాష్ట్ర, ముంబైని ఆమె అవమానిస్తున్నదని ఆరోపించింది. మహారాష్ట్రను అవమానించేవారు ముంబైకి రానవసరం లేదని పేర్కొంది. దీంతో ముంబై ఏమైనా పాక్ ఆక్రమిత కశ్మీరా అని కంగనా ప్రశ్నించింది. శివసేన కార్యకర్తల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ భద్రత కోసం కేంద్రాన్ని కోరగా ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించింది. దీంతో గత బుధవారం కంగనా మనాలి నుంచి రోడ్డు మార్గంలో చండీగఢ్‌కు వచ్చి అక్కడి నుంచి విమానంలో ముంబై చేరుకున్నది.

మరోవైపు కంగనా కార్యాలయంలో అక్రమ నిర్మాణాలున్నాయని నోటీసులు జారీ చేసిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గత బుధవారం ఆ కార్యాలయంలో కూల్చివేతలు చేపట్టింది. కంగనా దీనిపై బాంబే హైకోర్టును ఆశ్రయించగా కూల్చివేతలపై స్టే విధించింది. మరోవైపు దీనికి శివసేన ప్రభుత్వమే కారణమంటూ కంగనా మండిపడింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోపాటు సోనియా గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. గవర్నర్‌ను ఆదివారం కలిసి దీనిపై ఫిర్యాదు చేసింది. అయితే తాత్కాలిక స్టే కోసం వచ్చిన నేపథ్యంలో కంగనా సోమవారం మనాలికి తిరుగు ప్రయాణమైంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo