శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 10:18:33

విష‌మిస్తున్న న‌టుడి ఆరోగ్యం.. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపు

విష‌మిస్తున్న న‌టుడి ఆరోగ్యం.. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపు

మెహందీ, ఫ‌రేబ్  చిత్రాల‌లో హీరోగా రాణించిన ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు ఫ‌రాజ్ ఖాన్ ప్ర‌స్తుతం శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతూ బెంగ‌ళూరు కన్నింగ్ హాం రోడ్‌లోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న వైద్యానికి భారీగా ఖ‌ర్చు అవుతున్న నేప‌థ్యంలో అంత ఖ‌ర్చు చేయ‌లేని ప‌రిస్థితిలో కుటుంబం ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

తీవ్రమైన దగ్గుతో చావుబతుకుల మధ్య ఉన్న ఫరాజ్‌ఖాన్ గ‌త వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయ‌న వైద్యానికి భారీగా ఖ‌ర్చు అవుతుంది. ఫ‌రాజ్ ఖాన్ ఫ్యామిలీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ ద‌గ్గ‌ర ఉన్న సొమ్ముని అంతా ఖ‌ర్చు చేశారు. ఇప్పుడు చేసేదేం లేక సాయం అడుగుతున్నారు. ఫ‌రాజ్ ఖాన్ సోద‌రుడు ఫామ‌న్ ఖాన్ అన్న వైద్యం కోసం సాయం చేయాల‌ని కోరుతున్నాడు. వైద్యానికి రూ. 25 ల‌క్ష‌ల రూపాయ‌లు అవ‌స‌రం అని చెప్ప‌డంతో బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన పూజా భ‌ట్ స్పందించారు. ఫరాజ్ చికిత్స కోసం తనవంతు సాయం చేస్తున్నానని.. ఇతర సినీనటులు, అభిమానులు కూడా ఆ కుటుంబానికి తోడుగా నిలవాలని ట్వీట్ చేశారు.

ఫరాజ్ సినీ కెరీర్ చాలా ఏళ్ల క్రితమే ముగిసిపోయింది. చిన్న జాబ్‌ చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.  ఆయ‌న  తండ్రి యూసఫ్‌ఖాన్ కూడా అనేక సినిమాల్లో నటించారు. ఫ‌రాజ్ అభిమానులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధిస్తున్నారు. 


logo