శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Sep 03, 2020 , 09:09:44

హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్స‌న్‌కు క‌రోనా

హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్స‌న్‌కు క‌రోనా

హైద‌రాబాద్‌: హాలీవుడ్ హీరో డ్వెయిన్ జాన్స‌న్‌కు క‌రోనా సోకింది.  ఇంట్లో అంద‌రికీ కోవిడ్‌19 సంక్ర‌మించిన‌ట్లు అత‌ను ఇన్‌స్టాలో పోస్టు చేశాడు.  మాజీ రెజ్ల‌ర్ అయిన జాన్స‌న్ ప్ర‌స్తుతం ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక పారితోషం అందుకుంటున్న హీరోగా మారాడు. భార్య‌, ఇద్దరు కూతుళ్ల‌కు కూడా వైర‌స్ సోకిన‌ట్లు రాక్‌స్టార్ త‌న పోస్టులో తెలిపాడు. చాలా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉన్నా త‌మ‌కు వైర‌స్ సంక్ర‌మించింద‌ని డ్వెయిన్ తెలిపాడు. రెండున్న వారాల క్రితం త‌మకు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు 48 ఏళ్ల జాన్స‌న్ చెప్పాడు. ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి త‌మ‌కు వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు చెప్పాడు. ఇది చాలా విప‌త్క‌ర‌మైన స‌మ‌యం అని, స‌వాళ్ల‌తో కూడుకున్న‌ద‌న్నాడు. త‌న ప్రాధాన క‌ర్త‌వ్యం త‌న కుటుంబాన్ని కాపాడుకోవ‌డ‌మే అని తెలిపాడు. కోవిడ్‌19కు పాజిటివ్‌గా తేల‌డం అంటే.. ఎన్నో గాయాల క‌న్నా ఇది భిన్న‌మైంద‌న్నాడు. మాస్క్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని, దీన్ని రాజ‌కీయ ఎజెండా కూడా మార్చాల‌న్నాడు.  అయితే దీంట్లో రాజ‌కీయం ఏమీ లేద‌ని, మాస్క్‌ను అంద‌రూ ధ‌రించాల‌ని, ఇదే స‌రైన చ‌ర్య అని తెలిపాడు. సినిమాల్లో ప్ర‌వేశించ‌డానికి ముందు వ‌ర‌ల్డ్ రెజ్లింగ్ పోటీల్లో డ్వెయిన్ జాన్స‌న్ చాలా పాపుల‌ర్ అయ్యాడు. ద స్కార్పియ‌న్ కింగ్‌, ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్‌, జుమాంజీ లాంటి చిత్రాల్లో న‌టించాడు.  వైర‌స్ నుంచి కోలుకున్న‌ట్లు కూడా తాజాగా త‌న‌ వీడియోలో జాన్స‌న్ తెలిపాడు.