సీనియర్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు ఆయన చేసే ఫన్నీ పోస్ట్‌లు నెటిజన్స్‌కి భలే వినోదాన్ని అందిస్తాయి. ఇటీవల తనకు లాటరీ గెలుచుకున్నట్టు మెసేజ్ రాగా, దానిని హైదరాబాద్ పోలీసులకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక తాజాగా చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్‌ను కలిసినట్టు ఫొటో ఎడిట్ చేసి అందరికి ఆశ్చర్యాన్ని పంచారు.
ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(‘మా’) ఎన్నికల హడావిడి నడుస్తుంది. మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బ్రహ్మాజీ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.ఇందులోజింగ్ పిన్ బ్రహ్మాజీకి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే తాను మాత్రం నమస్కారం చేస్తున్నట్టుగా ఫొటోలో కనిపించాడు. ఇక ఆ ఫొటోకి.. ‘ఇది సాధారణ మీటింగ్ మాత్రమే. ఎలాంటి రాజకీయాలకు తావులేదు. ‘మా’ ఎన్నికల గురించి చర్చిచాం. కొన్ని టిప్స్ ఇచ్చారు అంటూ బ్రహ్మాజీ కామెంట్ చేశారు.