పూజాహెగ్డే డిమాండ్..ఆచార్య మేకర్స్ గ్రీన్ సిగ్నల్..!

స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ చిత్రంతోపాటు అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో కలిసి నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఆచార్య సినిమాలో కీ రోల్ కోసం మేకర్స్ ఈ భామను సంప్రదించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. రాంచరణ్ గెస్ట్ రోల్ చేస్తుండగా..పూజాహెగ్డే చెర్రీకి జోడీగా నటిస్తున్నట్టు టాక్.
అయితే పూజాహెగ్డే ఈ చిత్రానికి సంతకం చేయాలంటే మేకర్స్ కు ఓ కండిషన్ పెట్టిందట. సౌతిండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఒకరిగా ఉన్న పూజా..తనకు పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ఇస్తేనే సినిమాలో నటిస్తానని షరతు పెట్టిందట. ఈ బ్యూటీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా పూజా డిమాండ్‌కు మేకర్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం.
సాధారణంగా ఓ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఆచార్యలో చేస్తున్న చిన్నపాటి రోల్ కు కూడా అంతే మొత్తంలో తీసుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. మొత్తానికి ఆచార్య మేకర్స్ ఎలాంటి కాంప్రమైజేషన్ లేకుండా పూజాకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకోవడం విశేషమనే చెప్పుకోవాలి.
ఇవి కూడా చదవండి..
తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
కీర్తిసురేశ్ ఏడేళ్ల కల నెరవేరింది..!
సెట్స్‌లో పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్
రవితేజ బర్త్‌డే .. ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ విడుదల
కూలీ నెం 1 సాంగ్ కు శ్రద్దాదాస్ డ్యాన్స్..వీడియో
పుష్ప స్పెషల్ సాంగ్ లో 'బ్లాక్ రోజ్' బ్యూటీ?
శ్రద్దాదాస్ సొగసు చూడతరమా
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.