బుధవారం 03 జూన్ 2020
Cinema - Mar 31, 2020 , 16:36:50

చిరంజీవి కూడా అదే బాటలోనా?

చిరంజీవి కూడా అదే బాటలోనా?

కరోనా మహమ్మారి ప్రపంచమంతా ఆవహించింది. ఎక్కడికక్కడ అన్నీ స్థంబించిపోతున్నాయి. కొన్ని దేశాలు ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితులను అనుభవిస్తున్నాయి. అయితే టాలీవుడ్‌లో మాత్రం పరిస్థితి వేరుగా కనిపిస్తుంది. అన్ని రాష్ట్రాలతో కలిపి చూస్తే ఈ మహమ్మారి ఉదృతి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో కాస్త తక్కువనే చెప్పుకోవాలి. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న జాగ్రత్తలే. అందుకేనేమో టాలీవుడ్‌లో ఇప్పుడు ప్రమోషన్‌ల పర్వం మొదలెట్టారు. రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చేసిన హడావుడి తెలియంది కాదు. రెండు రోజుల పాటు కరోనాని కూడా మరిపించింది ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్. ఇప్పుడిదే దారిలో మరికొన్ని చిత్రాలు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలెట్టాయి. అందులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఉండటం విశేషం. 

టాలీవుడ్‌కి పెద్ద దిక్కుగా చెప్పుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు ప్రమోషన్ బాట పట్టారు. ప్రస్తుతం చిరంజీవి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివతో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర టైటిల్‌ని రీసెంట్‌గా జరిగిన ‘ఓ పిట్టకథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ఆచార్య’ అంటూ తెలియజేశారు. ఈ ‘ఆచార్య’కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ఏప్రిల్ 2న శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేయబోతున్నారని సమాచారం. మరి ఇలాంటి విపత్కర పరిస్థితులలో మెగాస్టార్ లాంటి వాళ్లే ఇలా స్టార్ట్ చేస్తే.. మిగతావారు మాత్రం ఆగుతారా? అనేదే ఇప్పుడందరిలో వ్యక్తమవుతున్న ప్రశ్న.


logo