మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Sep 29, 2020 , 11:56:42

ల్యాప్ టాప్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సోనూసూద్

ల్యాప్ టాప్ కంపెనీకు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా సోనూసూద్

క‌ష్టాల‌లో ఉన్న‌ప్పుడు కాద‌న‌కుండా సాయాలు చేసి అంద‌రి మ‌న‌సుల‌లో దేవుడిగా కొలువుండిపోయారు సోనూసూద్. రీల్ లైఫ్‌లో విల‌న్ పాత్ర‌లు పోషించిన ఆయ‌న రియ‌ల్ లైఫ్‌లో మాత్రం హీరో అయ్యాడు. ఇప్పుడు ఆయ‌న క్రేజ్ దేశ వ్యాప్తంగా పాకింది. అయితే ఇది క్యాష్ చేసుకోవాల‌నుకున్న ప్రముఖ ల్యాప్ ట్యాప్ కంపెనీ ఏస‌ర్ ఇండియా  సోనూసూద్‌ను తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. సోనూసూద్‌ వంటి మానవతావాది తమ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ కావడం ఎంతో ఆనందంగా ఉందని ఏసర్‌ ఇండియా భావిస్తోంది. అంతేకాదు కొత్త టెక్నాలజీల గురించి ఆయ‌న వివ‌రించ‌డం త‌మ సంస్థ‌కు ఎంతో ఉప‌యోగంగా ఉంటుంద‌ని  అంటుంది.

ఇన్నాళ్ళు ముంబైలో సోనూసూద్ రీసెంట్‌గా హైద‌రాబాద్‌కు వ‌చ్చారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా సంతోష్‌శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న అల్లుడు అదుర్స్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు . ఈ చిత్రంలో సోనూసూద్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు.  అయితే ఇదే సెట్‌లో ప్ర‌కాశ్ రాజ్‌.. సోనూసూద్‌ని స‌త్క‌రించిన సంగ‌తి తెలిసిందే. 


logo