బుధవారం 20 జనవరి 2021
Cinema - Nov 23, 2020 , 17:25:24

'ఛ‌త్ర‌ప‌తి ' స్క్రిప్ట్ రాస్తున్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌..!

 'ఛ‌త్ర‌ప‌తి ' స్క్రిప్ట్ రాస్తున్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌..!

టాలీవుడ్ న‌టుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ న‌టించిన రాక్ష‌సుడు చిత్రం తెలుగు, త‌మిళ భాషల్లో మంచి టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. సాయి శ్రీనివాస్ చిత్రాల హిందీ వెర్ష‌న్ కు మంచి మార్కెట్ ఉంటుంద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌న‌సరం లేదు. ఈ మేరకు సాయి శ్రీనివాస్ త‌న ఆలోచ‌న‌లు కూడా మార్చేసుకుంటున్నాడు. తెలుగులో రాజ‌మౌళి డైరెక్ట్ చేసిన ఛ‌త్ర‌ప‌తి సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎస్ఎస్ రాజ‌మౌళి తండ్రి విజయేంద్ర‌ప్ర‌సాద్ ఈ క‌థ‌నందించారు. సాయి శ్రీనివాస్ హిందీ వెర్ష‌న్ లో హీరోగా న‌టించ‌నున్నాడు. అయితే హిందీ ఆడియెన్స్ ను ఆక‌ట్టుకునేలా స్క్రిప్ట్ వ‌ర్క్ ను మారుస్తున్నార‌ట విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.

ప్ర‌ధానంగా సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాల్లో మార్పులు చేయ‌నున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ తో కంప్లీట్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రం ఆడియెన్స్ ను అల‌రించేలా డిజైన్ చేయ‌నున్నారు. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ రీమేక్ నిర్మాణ బాధ్య‌త‌లు తీసుకోనుంది. డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది ఇంకా తెలియాల్సి ఉంది. 

విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ‌నందించిన య‌మ‌దొంగ‌, మ‌గ‌ధీర‌, బాహుబ‌లి..ది బిగినింగ్‌, బాహుబ‌లి..ది క‌న్‌క్లూజ‌న్‌, భ‌జ‌రంగీభాయ్ జాన్ వంటి చిత్రాలు భార‌తీయ సినీపరిశ్ర‌మ‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఎన్టీఆర్‌-రాంచ‌రణ్ కాంబోలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఆర్ఆర్ఆర్ కు క‌థ‌నందిస్తున్నారు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo