అఖిల్‌పై అక్కసు వెళ్లగక్కిన అభిజీత్

సోహైల్ త్యాగంతో టిక్కెట్ టూ ఫినాలే మెడల్ అందుకున్నారు అఖిల్. ఇక హారిక, అభిజీత్‌లు ఓ చోట కూర్చోని పలు విషయాలపై చర్చించారు. నా కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేవు. ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదు. ఏం చెప్పిన కూడా సీరియస్‌గా తీసుకోవు. కొన్ని విషయాలను అర్దం చేసకొని వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తావని చూస్తా. కాని స్టాండ్ తీసుకోవు అంటూ అభిజీత్ చెప్పుకొచ్చాడు. దీనికి స్పందించిన హారిక.. ఎందుకు అభి ఒకే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు. అది మరచిపోవచ్చు కదా అని చెప్పింది. మర్చిపో అంటున్నావ్ తప్పితే హెల్ప్ చేయడం నీ వల్ల కావడం లేదా? నువ్ అర్థం చేసుకోవా? అని అభిజిత్ తిరిగి ప్రశ్నించాడు.
ఇక మరోసారి అఖిల్ టాపిక్ లేవనెత్తిన అభిజీత్.. నాలుగోవారంలో మొదటి వారం రీజన్ చెప్పి అఖిల్ నన్ను నామినేట్ చేశాడు. ఒరేయ్ అన్నానని అంటాడు, లేదని చెప్తాడు అంటూ అఖిల్‌పై అక్కసు వెళ్ళగక్కుతున్న సమయంలో అభిజీత్ దగ్గరకు వచ్చిన అఖిల్ థ్యాంక్స్ చెప్పాడు. నువ్వు లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదని అన్నాడు. టికెట్ టూ ఫినాలేలో మాతో పాటు నువ్వు కూడా నిద్రపోకుండా ఉన్నావని చాలా సపోర్ట్ చెసావని చెప్పుకొచ్చాడు. అయితే అభి.. నీ గురించే మాట్లాడుకుంటున్నామని అఖిల్‌తో అన్నాడు