మంగళవారం 02 మార్చి 2021
Cinema - Jan 22, 2021 , 08:28:00

ఈ ఫొటోలోని చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..!

ఈ ఫొటోలోని చిన్నారి ఎవ‌రో గుర్తుప‌ట్టారా..!

శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన హీరో అభిజీత్. ఈ సినిమాతో అభికు పెద్ద‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో ఇటీవ‌ల జ‌రి‌గిన బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కూల్ అండ్ కామ్‌గా గేమ్ ఆడుతూ చివరి వ‌ర‌కు వ‌చ్చిన అభిజీత్ టైటిల్‌ని గెలుచుకున్నారు. ప్ర‌స్తుతం సినిమాల వేట‌లో ఉన్న అభిజీత్ స్క్రిప్ట్స్ వింటున్నాడు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న లూసిఫ‌ర్ రీమేక్‌లో అభిజీత్‌కు ఆఫ‌ర్ ద‌క్కింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు ప్ర‌ధాన పాత్ర‌లో సినిమాలు చేసుకునేందుకు కూడా ప‌క్కా స్కెచ్ లు వేసుకుంటున్నాడు.

అభిజీత్ బిగ్ బాస్ షోతో ఎంత ఫేమ‌స్ అయ్యాడో ఆయ‌న త‌ల్లి కూడా అంతే ఫేమ‌స్ అయ్యారు. ఓ సారి  త‌న కుమారుడిని క‌ల‌వ‌డానికి  హౌజ్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు కొట్టుకోండి, మ‌స్త్‌ మ‌జా వ‌స్తుంద‌ని ఆమె ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో  అన్నారు. ఆమె మాట‌లు నెటిజన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా అభిజీత్ త‌న త‌ల్లితో దిగిన చిన్న నాటి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. దీనికి మామ్ ల‌వ్ అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ ఫొటో అభి ఫ్యాన్స్‌ని బాగా ఆక‌ట్టుకుంటోంది. 

VIDEOS

logo