మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 09:09:45

మీ అమ్మ‌కి నేను ఇష్టం, నువ్వు ఎందుకు నన్ను ప‌ట్టించుకోవ‌ట్లేదు: అభిజీత్

మీ అమ్మ‌కి నేను ఇష్టం, నువ్వు ఎందుకు నన్ను ప‌ట్టించుకోవ‌ట్లేదు: అభిజీత్

మంగ‌ళ‌వారం ఎపిసోడ్‌లో అభిజ‌త్‌.. మోనాల్తో బానే పులి హోర క‌లిపాడు. ఇన్ని రోజులు ఆమెను కాస్త దూరం పెట్టిన అభి నామినేష‌న్ లో సేవ్ చేసే స‌రికి ఆమెను ఆకాశానికి ఎత్తాడు. నామినేష‌న్ స‌మ‌యంలో నువ్వు మాట్లాడిన మూడు పాయింట్స్ చాలా బాగా చెప్పాయి అని అన్నాడు. దీంతో మోనాల్‌.. నిన్ను ఎప్పుడైన హ‌ర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పింది.  ఇక మ‌నోడు మోనాల్ ఎత్తే ప‌నిలో భాగంగా నువ్వు మా డాడీకి న‌చ్చావు అంటే మాములు విష‌యం కాదు. మా డాడీ మ‌నిషిని మొత్తం చూసి స్టేట్‌మెంట్ ఇస్తారు . మీ అమ్మ న‌న్ను అభిమానిస్తుంది. కానీ నువ్వు న‌న్ను ఎందుకు చూడటం లేదో అంటూ మోనాల్‌తో అర్ద‌రాత్రి ముచ్చ‌టించాడు  

ఇక అవినాష్‌- సోహైల్‌లు నామినేషన్ గురించి కొద్ది సేపు చ‌ర్చించుకున్నారు. శ‌ని,ఆదివారాల‌లో ఏ డ్రెస్ వేసుకుంటావు అని అత‌నిని ఆట ప‌ట్టించాడు. అనంతరం బిగ్ బాస్ నుండి ఓ అనౌన్స్ మెంట్ వ‌చ్చింది. గ‌తంలో ఎప్పుడు లేని విధంగా నామినేట్ అయిన స‌భ్యుడు సేవ్ అవ్వ‌డానికి ఎవిక్ష‌న్ పాస్ ఇస్తున్నాం. దీంతో నామినేష‌న్ నుండి బ‌య‌ట‌ప‌డొచ్చు అని బిగ్ బాస్ అన్నారు. అయితే ఇది ద‌క్కించుకోవాలంటే ఇంట్లో ఉన్న ఎక్కువ  బిగ్ బాస్ జెండాల‌ని  సంపాదించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. రెండు లెవ‌ల్స్ సాగిన ఈ గేమ్‌లో ఎవ‌రు విజేత గా నిలుస్తారో వారికి ఎవిక్ష‌న్ పాస్ ఇస్తామ‌ని బిగ్ బాస్ అన్నారు.


logo