సోమవారం 18 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 11:01:36

జైలుకు వెళ్ళిన వ‌ర‌స్ట్ ఫ‌ర్‌ఫార్మ‌ర్‌ అభిజిత్

జైలుకు వెళ్ళిన వ‌ర‌స్ట్ ఫ‌ర్‌ఫార్మ‌ర్‌ అభిజిత్

బిగ్ బాస్ సీజ‌న్ 4లో శుక్ర‌వారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఓ టాస్క్ ఇచ్చారు. దీని ప్ర‌కారం హౌజ్‌లో ఉన్న ఆరుగురు త‌మ స్థానాలు నిర్ణ‌యించుకోవ‌ల‌సి ఉంటుంది.  అఖిల్ ఇప్ప‌టికే ఫినాలేకు చేరుకున్నాడు కాబ‌ట్టి ఈ ఆరుగురు పోటి ప‌డాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ చెప్పారు. 1 నుండి 6 స్థానాల‌లో నిలుచున్న హౌజ్‌మేట్స్ ఆ స్థానానికి తాము ఎందుకు అర్హులో కూడా వివ‌రించాల్సి ఉంటుంద‌ని బిగ్ బాస్ స్ప‌ష్టం చేశారు.

మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని బెస్ట్‌ ఫెర్మార్మర్‌ ఆఫ్‌ దీ సీజన్‌గా, చివరి స్థానంలో ఉన్న వారిని వరస్ట్‌ ఫెర్మార్మర్‌ ఆఫ్‌ది సీజన్‌గా ఉంటార‌ని బిగ్ బాస్ చెప్ప‌డంతో ఇంటి స‌భ్యుల‌లో  సోహైల్  మొద‌టి స్థానంలో, రెండో స్థానంలో అరియానా, మూడో స్థానంలో హారిక, నాల్గో స్థానంలో మోనాల్‌, ఐదో, ఆరో స్థానాల్లో అవినాష్‌, అభిజిత్‌ నిలబడ్డారు. వారు ఆ స్థానాలు ఎందుకు ఎంపిక చేసుకోవ‌ల‌సి వ‌చ్చిందో వివ‌రించారు. తాను 100 శాతం ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చాన‌ని, ఒక్కోసారి కొప్ప‌డ్డ త‌ర్వాత సారీ చెప్పాను అని అన్నాడు. అందుకోస‌మే తాను మొదటి స్తానం ఎంచుకున్నాను అని సోహైల్ అన్నాడు. 

ఇక రెండో స్థానంలో ఉన్న అరియానా . బిగ్ బాస్ గేమ్ అనేది వ్య‌క్తిగ‌తంగా ఆడాలి. సాధ్య‌మైనంత వ‌ర‌కు నేను సోలోగానే ఆడాను. నాకు మొద‌టి స్థానం ద‌క్కుతుంద‌ని నేను భావిస్తున్నాను అని అరియానా పేర్కొంది. ఇక అవినాష్ మాట్లాడుతూ ఇంట్లో అంద‌రి క‌న్నా త‌క్కువ నామినేట్ అయింది నేనే. ఎక్కువ‌గా నామినేట్ కాలేదు అంటే నేను అంద‌రితో మంచిగా ఉంటాన‌నే క‌దా. నాకు రెండో స్థానం క‌రెక్ట్ అని భావిస్తున్నాను అని అవినాష్ చెప్పుకొచ్చాడు. హారిక మాట్లాడుతూ.. టాస్క్‌పైనే పూర్తిగా దృష్టి పెట్టిన నేను కెప్టెన్‌గా ఉన్న‌ప్పుడు చిన్న త‌ప్పులు చేశాను. అందుకే టాప్ 2 అనుకుంటున్నాను 

ప్రేక్ష‌కుల వ‌ల‌న ప్ర‌తి సారి నామినేష‌న్ నుండి సేవ్ అవుతున్నాను. వారి వ‌ల‌న 13 వారానికి చేరుకున్నాను. గేమ్ కూడా బాగా ఆడుతున్నాను. మూడో స్థానం నాకు కావాలి అని మోనాల్ చెప్పింది. హారిక‌తో ఇదే విష‌యంపై డిస్క‌స్ చేసి తాను మూడో స్థానంకి వెళ్ళ‌గా, హారిక నాలుగులోకి వ‌చ్చేసింది. ఇక అభిజిత్‌.. ప్ర‌తి టాస్క్ నేను బాగా ఆడాను. గ‌త వారం చేసిన మిస్టేక్ వ‌ల‌న ఈ సీజన్‌ వరస్ట్‌ ఫెర్ఫార్మర్‌ తీసుకోవాడిని రెడీగా ఉన్నానంటూ చెప్పాడు. అలానే తాము ఇప్పుడు ఫైట్ చేసే ప‌రిస్థితులో లేమ‌ని చెప్పారు సోహైల్, హారిక‌. చాలా బాండింగ్స్, ఎమోష‌న్స్ ఏర్ప‌డ్డాయి. హౌజ్‌లో ఏం జ‌రుగుతుందో అర్ధం కావ‌డం లేద‌ని అన్నాడు.

ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే అభిజీత్ కూడా క‌న్నీళ్ళు పెట్టుకున్నాడు.  ఈ టైంలో పొజిషన్స్ కోసం కొట్లాడటం అంటే చాలా బాధగా ఉంది బిగ్ బాస్ అంటూ అందరూ ఎమోషనల్ అయ్యారు.అనంతరం బిగ్ బాస్ .. సీజ‌న్  బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా సోహైల్‌ని, వరస్ట్‌ ఫెర్మార్మర్‌గా అభిజిత్‌ను ప్రకటించాడు. వ‌ర‌స్ట్ ప‌ర్‌ఫార్మ‌ర్ అయిన కార‌ణంగా అభిజీత్‌కి జైలు దుస్తులు వేసి జైలుకి పంపించారు బిగ్ బాస్.