శనివారం 23 జనవరి 2021
Cinema - Nov 24, 2020 , 10:09:37

మోనాల్‌తో వార్ వ‌ద్దు అన్న‌ అభిజిత్‌.. కార‌ణం ఏంటో తెలుసా?

మోనాల్‌తో వార్ వ‌ద్దు అన్న‌ అభిజిత్‌.. కార‌ణం ఏంటో తెలుసా?

నామినేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా అఖిల్.. మోనాల్‌తో స్వాప్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. ఇందులో భాగంగా నేను నీ క‌న్నా స్ట్రాంగ్ అని తెలుసు. చాలా సార్లు నీకు స‌పోర్ట్ చేశాను ఈ సారి నామినేష‌న్‌లోకి రా అని అఖిల్ చెప్ప‌డంతో అందుకు అఖిల్‌తో విభేదించింది మోనాల్. నాకు ఇక్క‌డి నుండి రావ‌డం ఇష్టం లేద‌ని చెప్పింది. ఎపిసోడ్ మొద‌ట్లో అఖిల్ మాట్లాడిన మాట‌ల‌కు చాలా హ‌ర్ట్ అయిన మోనాల్‌.. స్వాప్ చేసేందుకు అస‌లు ఆస‌క్తి చూప‌లేదు. దీంతో అరియానా .. సోహైల్, మోనాల్‌ల‌తో స్వాప్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించింది 

ముందు సోహైల్‌తో స్వాప్ చేసుకునేందుకు అరియానా చాలా ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ అక్క‌డ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇక మోనాల్‌తో చాలా సేపు వాదించింది. నీక‌న్నా చాలా బాగా గేమ్ ఆడుతున్నాను అంటూ పాత విష‌యాలు తవ్వి మోనాల్‌ని క‌న్విన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ మోనాల్ క‌ర‌గ‌లేదు. ఇక అభిజిత్ ఛాన్స్ రాగా, అత‌ను త‌న‌కు స్వాప్ చేసుకోవ‌డం ఇష్టం లేదు అని చెప్పేశాడు. రీసెంట్‌గా మోనాల్ త‌ల్లి స్టేజ్‌పై నుండి నువ్వు నా ఫేవ‌రేట్ అన‌డంతో అక్క‌డే ఫ్లాట్ అయ్యాను. మ‌న ఇద్ద‌రి మ‌ధ్య ఎన్ని విభేదాలు ఉన్నా, మీ అమ్మ అన్న మాట‌కు నేను ప‌డిపోయా. నాకు మ‌ద‌ర్ సెంటిమెంట్ ఎక్కువ అని అభిజిత్ అన్నాడు. అభిజిత్ నిర్ణ‌యంతో సోహైల్‌, మోనాల్ సేవ్ కాగా అఖిల్, అభిజిత్, అరియానా, అవినాష్‌లు నామినేట్ అయ్యారు


logo