బుధవారం 20 జనవరి 2021
Cinema - Dec 03, 2020 , 00:08:32

అభివ్యక్తి అన్వేషణ!

అభివ్యక్తి అన్వేషణ!

యాక్టింగ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ద్వారా ఔత్సాహిక కళాకారులకు నటనలో శిక్షణ అందిస్తున్న మహేష్‌ గంగిమల్ల దర్శకుడిగా మారుతున్నారు. ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అభివ్యక్తి’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత భూపాల్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో రాకేష్‌ వర్రె క్లాప్‌ కొట్టాడు. మాధవ్‌ కోదాడ గౌరవ దర్శకత్వం వహించారు. కొత్త పాత నటీనటులతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జైపాల్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ‘మల్లేషం’ఫేం అనన్య నాగళ్ల ముఖ్యపాత్రలో కనిపిస్తారు. జనవరి నుంచి చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం కోసం టాలెంట్‌ హంట్‌ కూడా నిర్వహించబోతున్నామని దర్శకుడు తెలిపారు. 


logo