మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Cinema - Aug 11, 2020 , 08:41:22

త‌న కోసం ప్రార్ధించిన వారంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అభిషేక్

త‌న కోసం ప్రార్ధించిన వారంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అభిషేక్

బాలీవుడ్ న‌టుడు అభిషేక్ బ‌చ్చ‌న్ క‌రోనాతో దాదాపు నెల రోజుల పాటు నానావ‌తి ఆసుప‌త్రిలో చికిత్స పొందిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా ఆయ‌న క‌రోనా నుండి కోలుకొని  ఆసుప‌త్రి నుండి  డిశ్చార్జ్ అయ్యారు. అయితే త‌నకి క‌రోనాకి సోకింద‌ని తెలిసి, త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అభిషేక్ కోలుకోవాలంటూ అభిమానులు, కో స్టార్స్ త‌మ ట్విట్ట‌ర్ ద్వారా ప్రార్ధించారు. వారంద‌రి ట్వీట్స్‌ని వీడియోలో చేర్చి ప్ర‌తి ఒక్కరికి పేరుపేరున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.మాటలు స‌రిపోవు..థ్యాంక్యూ ఆల్ అంటూ వీడియోకి కామెంట్ పెట్టారు. అభిషేక్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్ధించిన వారిలో రితేష్ దేశ్‌ముఖ్‌, నీల్ నితిన్ ముఖేష్ కూడా ఉన్నారు. అభిషేక్‌తో పాటు ఆయ‌న ఫ్యామిలీలో అమితాబ్ బ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్య‌రాయ్, ఆరాధ్య‌ల‌కి కూడా క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. వారంద‌రు ప్ర‌స్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.


logo