శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 01, 2020 , 13:38:38

హారిక‌కు సారీ చెప్పిన అభి..కింద‌ప‌డ్డ అవినాష్

హారిక‌కు సారీ చెప్పిన అభి..కింద‌ప‌డ్డ అవినాష్

కాయిన్లు సంపాదించాల‌నేది బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌కు ఇచ్చిన టాస్క్. దొంగ‌త‌నం కూడా ఈ టాస్క్ లో భాగ‌మే. బుధ‌వారం ఎపిసోడ్ లో ఏం జ‌రిగిందో చూద్దాం. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా కొంత‌మంది క‌ష్ట‌ప‌డి కాయిన్లు సేక‌రిస్తుంటే..మ‌రొకొంద‌రేమో కాయిన్ల‌ను దొంగ‌త‌నం చేయ‌డంపై దృష్టి పెట్టారు. ఇక హారిక కాయిన్ల‌ను సోహైల్ కొట్టేయ‌గా..నేను కాయిన్ల‌ను అక్క‌డ దాచిన విష‌యం ఎవ‌రు చెప్పార‌ని అడిగింది హారిక‌. ఆ విష‌యం త‌ర్వాత చెప్తాన‌ని మెహ‌బూబ్ అన్నాడు.


హారిక చేయి ప‌ట్టుకుని సారీ చెప్పిన అభిజిత్‌

ఈ నేప‌థ్యంలో ఎవ‌రెవ‌రు కాయిన్ల‌ను ఎక్క‌డ పెట్టుకున్నార‌న్న విష‌యం అంద‌రికీ చెప్తోన్న మాస్ట‌ర్ త‌న గుట్టు బ‌య‌ట‌ప‌డుతుందేమోన‌ని భ‌య‌ప‌డుతూ..నాతో మాట్లాడ‌కు అంటూ మోహ‌బూబ్ ను హెచ్చ‌రించాడు. అభితో దూరం మెయింటైన్ చేస్తున్న హారిక..నువ్వు స్వాతికెందుకు మ‌ద్దతిస్తున్నావ్ అని అభిని నిల‌దీసింది. స్వాతి వ‌చ్చి రెండు మూడు రోజులే అవుతుంది, ఆమెకిచ్చిన ప‌నిని చేయ‌లేక‌పోతుంది. ఆమె డేంజర్ జోన్ లో కూడా లేదు. కానీ ఆమె కోసం గొడ‌వ ప‌డి మ‌రీ నాణేలు సేకరించాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని అభిజిత్ ను ప్ర‌శ్నించింది. దీంతో అభిజిత్ హారిక‌కు చేయి ప‌ట్టుకుని క్ష‌మాప‌ణ చెప్పాడు.  ఆ త‌ర్వాత స్విచ్ కాయిన్ ను మెహ‌బూబ్ చేతులారా కింద‌ప‌డేశాడు. అదే ముఖ్య‌మైన కాయిన్ అని బిగ్ బాస్‌చెప్ప‌డంతో తెల్ల‌ముఖం వేసిన‌మెహ‌బూబ్ కు సోహైల్ క్లాస్ పీకాడు. అనంత‌రం హౌజ్ లో అంతా ప‌డుకున్న త‌ర్వాత అరియానా గ్లోరీ, లాస్య‌, సోహైల్ కూడ‌బ‌లుక్కొని మాస్ట‌ర్ ద‌గ్గ‌ర ఉన్న కాయిన్ల మొత్తాన్ని కొట్టేశారు. అటు త‌ర్వాత సోహైల్ తీన్మార్ స్టెప్పులేసి అద‌ర‌గొట్టాడు. కానీ బాగా చివాట్లు ప‌డ్డాయి సోహైల్ కు. మ‌రోవైపు నోయ‌ల్, సుజాత కూడా మోహ‌బూబ్ కాయిన్ కొట్టేశాడు. ఇక ఇంటి స‌భ్యులంతా రాత్రి నిద్ర‌పోతుంటే..జాగారం చేసి మ‌రీ క‌ష్ట‌ప‌డి కొట్టేసిన మెహ‌బూబ్‌, సోహైల్ కిలాడీ దొంగ‌ల్లా నిలిచారు. 


సోహైల్‌పై విరుచుక‌ప‌డ్డ మాస్ట‌ర్..

ఉద‌యాన్నే త‌న కాయిన్లు క‌నిపించ‌క‌పోవ‌డంతో మాస్టర్ సోహైల్ పై తీవ్రంగా మండిప‌డ్డాడు. మీరు చూస్తేనే దొంగ‌ల్లా ఉన్నారు. మీరు ఎలా గెలుస్తారో చూస్తా అంటూ చాలెంజ్ విసిరాడు. ఆవేశంలో అమ్మ‌రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ కుమార్ సాయిపై త‌న కోపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. కుమార్ సాయిని చుల‌క‌నగా చేస్తూ మాట్లాడాడు. ఇదిలా ఉంటే బ్రాండ్లు క‌నిపించ‌కుండా బ‌ట్ట‌లు ఆర‌వేస్తున్నార‌ని, వాటిని తీసివేయాల‌ని బిగ్ బాస్ లేఖ పంపించాడు. దీంతో స‌భ్యులంతా మెహ‌బూబ్‌, సోహైల్ కాయిన్ల‌పై ప‌రిచిన వ‌స్త్రాన్ని తీసేయాల‌ని గొడ‌వ‌పెట్ట‌గా..అక్క‌డ బ్రాండ్ వ‌స్తువులే లేవ‌ని గంగ‌వ్వ‌, అఖిల్ మాత్రం వారికి మ‌ద్ద‌తుగా నిలిచారు. దీంతో కిల్ల‌ర్ కాయిన్స్ టాస్క్ పూర్త‌యింద‌ని బిగ్ బాస్‌ప్ర‌క‌టించాడు. 

మొత్తానికి బిగ్ బాస్ ఇచ్చిన ఈ టాస్క్ లో అవినాష్  3160 కాయిన్లు సంపాదించ‌గా..మెహ‌బూబ్ 4360 కాయిన్స్ తో ఎక్కువ పాయింట్లు సాధించాడు. అదేవిధంగా సోహైల్ 3620, అఖిల్ 2570, స్వాతి 1930, అరియానా 1850, అభిజిత్ 1770, హారిక 1450, కుమార్ సాయి 1570, నోయ‌ల్ 900, మోనాల్ 610, దివి 110, సుజాత 340+ స్విచ్ కాయిన్ సంపాదించుకున్నారు. కింద ప‌డిపోయిన అవినాష్..

అయితే గేమ్ ఇక్కడితో పూర్త‌వ‌లేదు. ఇపుడు ఈ కాయిన్స్ ను కాపాడుకోవ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. రెండో రౌండ్‌లో కిల్ల‌ర్ కాయిన్ ను ఎవ‌రిపై అతికిస్తే వారి స‌గం పాయింట్లు ఆవిరైపోతాయి. స‌భ్యులంతా సోహైల్ పై ప‌గ పెంచుకోవ‌డంతో ..ఒక‌రినే టార్గెట్ చేస్తే స్టోరీ వేరేలా ఉంట‌ది అని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అమ్మ‌రాజ‌శేఖ‌ర్, సోహైల్ ఒక‌రిపై మ‌రొక‌రు అరుచుకున్నారు. ఆ త‌ర్వాత మోనాల్ ఔట‌యింది. మ‌రోవైపు అవినాష్ కింద‌ప‌డిపోయాడు. అంతా ఏమైంద‌ని అంద‌రూ ఆందోళ‌న చెంద‌గా..కాలు బెణికింద‌ని చెప్పాడు అవినాష్. దీంతో అవినాష్ ను ఇంటి స‌భ్యులు మెడిక‌ల్ రూమ్ కు ఎత్తుకెళ్లారు. మ‌రోవైపు మాస్ట‌ర్ కాయిన్స్ అంద‌రూ ఎత్తుకెళ్లినా త‌న‌ను మాత్ర‌మే ప్ర‌శ్నించారని మోనాల్ బోరున ఏడ్చేసింది. ఇంకా ఆ త‌ర్వాత ఏమైంద‌నేది నెక్ట్స్ ఎపిసోడ్ లో తెలుస్తుంది.